సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్న నటి రంభ
- 90వ దశకంలో ఒక వెలుగు వెలిగిన రంభ
- ఇప్పటికీ ఎంతో మందికి అభిమాన నటి రంభ
- రీఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని వెల్లడి
ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ... సినిమా అనేది తన ఫస్ట్ లవ్ అని తెలిపింది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇది సరైన సమయంగా భావిస్తున్నానని చెప్పింది. ఒక నటిగా ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు ఇది కరెక్ట్ టైమ్ అని తెలిపింది. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులకు అర్థవంతమైన రీతిలో కనెక్ట్ కావాలనుకుంటున్నానని చెప్పింది.