Kethika Sharma: కుదురుకోలేకపోతున్న కుర్ర హీరోయిన్లు!

Career Path Lagging For Young Heroines
షార్ట్స్‌లో చూడండి
హీరోయిన్స్ అందంగా ఉంటారు... అయితే అందంగా ఉన్నవాళ్లంతా హీరోయిన్స్ కాలేరు. అందుకు అభినయం తెలియాలి... అదృష్టం ఉండాలి... లౌక్యం కూడా ఉండాలి. ఎంత అందంగా ఉన్నప్పటికీ ఇవి లేకపోతే ఇక్కడ నెగ్గుకు రావడం కష్టమే. కథానాయికల వరకూ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి... చేజారిపోయేవే ఎక్కువగా ఉంటాయి. అందువలన అవకాశాలను దక్కించుకోవడమే వారి ముందున్న పెద్ద పజిల్.ఒకప్పటిలా హీరోయిన్స్ ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారు. అందుకు కారణాలను అన్వేషిస్తూ వెళితే, ఫ్లాప్ లు పడటం అనేది ఒక కారణంగా మాత్రమే కనిపిస్తుంది. నిజానికి ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్స్ గ్లామర్ ఏమీ తగ్గినట్టు కాదు... వాళ్లను ఆడియన్స్ రిజెక్ట్ చేసినట్టు కాదు. కానీ ఎంత గ్లామర్ ఉన్నప్పటికీ హీరోయిన్స్ ఇతర భాషలను వెతుక్కుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తోంది.కృతి శెట్టి, శ్రీలీల విషయానికి వస్తే... గ్లామర్, నటన, డాన్స్... ఇలా ఎందులోను వారిని పక్కన పెట్టలేం. హిట్ సినిమాతోనే వారి ఎంట్రీ జరిగింది. కానీ చాలా ఫాస్టుగా తెలుగులో వాళ్ల కెరియర్ మసకబారిపోయే పరిస్థితి వచ్చింది. నిధి అగర్వాల్, కేతిక శర్మ, నేహా శెట్టి... ఇలాంటి బ్యూటీలకు ఛాన్సులు లేకపోవడం విచారించదగిన విషయం. ఈ కుర్ర హీరోయిన్లు కుదురుకోలేకపోతుండటం అభిమానులకు మాత్రం నిరాశను కలిగించే విషయమే.
Go Back to Shorts
Kethika Sharma
Neha Shetty
Sreeleela
Krithi Shetty

More Telugu News