అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం... వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక భేటీ
- వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న జగన్
- తాను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ధీమా
- 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వస్తాయని వెల్లడి
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు మనం హాజరుకావడం లేదని తెలిపారు. మరో 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానని... తనతో పాటు ఉండేవాళ్లే తనవాళ్లు అని చెప్పారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పారు.