మాకే ఫైన్ వేస్తారా? మీకు కట్ చేస్తాం!
- విద్యుత్తు-ట్రాఫిక్ సిబ్బంది తీరు నివ్వెర పరిచిన వైనం
- నువ్వలా చేస్తే.. నేనిలా చేస్తానన్నట్టుగా వ్యవహారం
- చలానా వేసినందుకు విద్యుత్తు సిబ్బంది కినుక
- ట్రాఫిక్ సిగ్నళ్లకు కరెంట్ కట్
నువ్వలా చేస్తే.. నేనిలా చేస్తా అన్నట్టుగా ఉన్న ఈ ఘటన ఇటీవల మెదక్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఉద్యోగ విధుల్లో భాగంగానే ట్రిపుల్ రైడ్‌తో వెళుతున్నాం అని చెప్పినా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారని విద్యత్ శాఖ సిబ్బంది వాపోయారు. అయితే ట్రాఫిక్ చలానాలు సరిచేస్తామని చెప్పినా కూడా సిగ్నళ్లకు విద్యత్ కనెక్షన్ తీసేశారని ట్రాఫిక్ సీఐ నాగరాజు చెప్పారు. ట్రాన్స్ కో అధికారులతో చర్చించడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించారు.