రూ. 4 వేల కోట్ల విలువైన జయలలిత ఆస్తులు ప్రభుత్వానికి అప్పగింత
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత ఆస్తుల జప్తు
- ఇప్పటి వరకు బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆస్తులు
- 10 వేల చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం సహా మరెన్నో ఆస్తులు
ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయింది. ఈ క్రమంలో అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను కర్ణాటకకు తరలించి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఇప్పటి వరకు భద్రపరిచారు. జప్తు చేసిన సమయంలో ఈ ఆస్తుల విలువ రూ. 913.14 కోట్లుగా అధికారులు అంచనా వేయగా, ఇప్పుడు కనీసం రూ. 4 వేల కోట్లుగా ఉండొచ్చని సమాచారం.