గుండు తుడిచేందుకు ప్రత్యేకంగా ఓ మనిషి.. లలితా జ్యువెలర్స్ అధినేత వీడియో వైరల్
--
నాని అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ ‘జీవితంలో ఎంత సంపాదించాలంటే.. ఇదిగో ఇలా గుండుకు పట్టిన చెమటను తుడిచేందుకు ఓ ఉద్యోగిని పెట్టుకునేంతగా’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ క్యాప్షన్ కు తోడు గుండు బాస్ చెమట తుడుస్తున్న దృశ్యాలను చూసి నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేశారు. ఈ వీడియోకు చాలా మంది నవ్వుతున్న ఎమోజీలతో, మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఇదీ అన్నా లైఫ్ అంటే..’ అని ఒకరు, ఆ ఉద్యోగం నాకిప్పించండి అని మరొకరు.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ కంటే గుండును మెయింటెన్ చేయడమే చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటూ మరొక యూజర్ కామెంట్ పెట్టాడు.