మహా కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన కోమటిరెడ్డి
- అక్కడి ఘాట్ లో ప్రత్యేక పూజల నిర్వహణ
- బడే హనుమాన్ ఆలయంలో మొక్కుల సమర్పణ
తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయాగ్ రాజ్ కు వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తెల్లవారుజామున 5.10 గంటలకు పుణ్యస్నానం చేశారు. అనంతరం అక్కడి ఘాట్ లో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయస్వామికి మొక్కులు సమర్పించారు.