Vijayasai Reddy: వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు ఉన్నవాడిని కాబట్టే.. అంటూ జగన్ కు విజయసాయిరెడ్డి కౌంటర్
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది. రాజకీయాల్లో విజయసాయిరెడ్డికైనా, మరెవరికైనా సరే విశ్వసనీయత ఉండాలంటూ నిన్న జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. భయంతోనే, ప్రలోభాలకు లొంగిపోయో లేదా మరే కారణం వల్లో అవతలివారికి లొంగిపోకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ చేసిన ఈ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి తాజాగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 'వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి, ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువులోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలనే వదులుకున్నా' అని ట్వీట్ చేశారు. విజయసాయి ట్వీట్ ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.