ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని కాపాడిన రాచకొండ పోలీసులు... వీడియో ఇదిగో!
అక్కడికి వెళ్లి చూసిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు... ఓ యువతి గది లోపలి నుంచి గడియ పెట్టుకున్నట్టు గుర్తించారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తలుపులు బద్దలు కొట్టి ఆ యువతిని కాపాడారు. ఆమె ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమింపజేశాక... ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను రాచకొండ పోలీస్ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
ఆ ఇద్దరు కానిస్టేబుళ్ల సత్వర స్పందన, వారి అంకితభావం ఓ విలువైన ప్రాణాన్ని నిలబెట్టిందని ఆ పోస్టులో కొనియాడారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆత్మహత్య ఆలోచనలు చేయకుండా, తమకు ఇష్టమైన వారితో మాట్లాడి, వారి సాయం తీసుకోవాలని సూచించారు.
అత్యవసర సమయాల్లో డయల్100కి కాల్ చేయవచ్చని, 87126 62111 నెంబరు ద్వారా వాట్సాప్ లో సంప్రదించవచ్చని ఆ పోస్టులో సూచించారు.