'సంక్రాంతికి వస్తున్నాం' కలెక్షన్ల సునామీ... ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పిన వెంకీమామ!
- విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబోలో 'సంక్రాంతికి వస్తున్నాం'
- గత నెల 14న థియేటర్లలోకి వచ్చిన మూవీకి సూపర్ హిట్ టాక్
- ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ. 303 కోట్లు వచ్చినట్లు తాజాగా మేకర్స్ ప్రకటన
- రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని పోస్టర్ విడుదల
ఇక ఇప్పటివరకు ఈ చిత్రానికి రూ. 303 కోట్లు వచ్చినట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ చిత్రం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని పోస్టర్ విడుదల చేశారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు. మూవీ ఆల్బమ్‌లోని దాదాపు అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. వెంకీమామ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు.