ఒక రోజు ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
- ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి
- సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు
- అసెంబ్లీ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ
అయితే ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 4వ తేదీనే తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ సబ్ కమిటీ కులగణన నివేదిక, ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ నివేదికను కేబినెట్‌కు అందజేస్తారు.
కుల గణన నివేదిక, ఎస్సీ వర్గీకరణలపై చర్చించి మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్ సమావేశం అనంతరం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ, శాసనమండలిలో ఈ రెండు నివేదికలను ప్రవేశపెట్టి చర్చిస్తారు.