వరుణ్ సూపర్ 'ఫైవ్'... 171 పరుగులు చేసిన ఇంగ్లండ్
- రాజ్ కోట్ లో మూడో టీ20
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసిన ఇంగ్లండ్
- 24 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన మిస్టరీ స్పిన్నర్
ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డకెట్ 51, లియామ్ లివింగ్ స్టన్ 43, కెప్టెన్ జోస్ బట్లర్ 24 పరుగులు చేశారు.
టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5, హార్దిక్ పాండ్యా 2, రవి బిష్ణోయ్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.