తదుపరి ఏపీ పోలీస్ బాస్ హరీశ్ కుమార్ గుప్తా!
- సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో
- ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్
- సీనియారిటీలో రెండో స్థానంలో 1992 బ్యాచ్ ఐపీఎస్ హరీశ్ కుమార్ గుప్తా
- ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న హరీశ్ కుమార్
ఈ నేపథ్యంలో హరీశ్ కుమార్ గుప్తా నూతన డీజీపీగా నియమితులయ్యే అవకాశముందని వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావే ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నందున పదవీ విరమణ తర్వాత ఆయనను ఆ పోస్టులో కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు.
హరీశ్ కుమార్ గుప్తా సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని రోజుల పాటు డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారకా తిరుమలరావు డీజీపీగా నియమితులయ్యారు.