కర్ణాటక రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
- కర్ణాటకలోని సింధనూరు వద్ద రోడ్డు ప్రమాదం
- బోల్తా పడిన వాహనం... నలుగురి మృతి
- మృతుల్లో డ్రైవర్ సహా ముగ్గురు వేద విద్యార్థులు
ఎంతో భవిష్యత్తు ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో వారి కుటుంబాలు తీవ్ర శోకంతో ఉన్నాయని, వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు వివరించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు.