భర్తతో గొడవపడి తమిళనాడు నుంచి బెంగళూరు వచ్చిన మహిళపై సామూహిక లైంగికదాడి
- బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తుండగా ఘటన
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- బాధితురాలిని షెల్టర్ హోంకు తరలించిన పోలీసులు
ఈ క్రమంలో అక్కడే ఉన్న నిందితులను యలహంక వెళ్లే బస్సు ఎప్పుడొస్తుందని విచారించింది. అందుకు వారు ఆ బస్సు ఇక్కడ ఆగదని, మరో బస్టాప్ దగ్గర ఆగుతుందని చెప్పి సాయం చేస్తున్నట్టు నటిస్తూ ఆమెను గోడౌన్ స్ట్రీట్‌కు తీసుకెళ్లారు. అక్కడ నిందితులు ఇద్దరూ కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్, డబ్బులు, నగలు దోచుకుని పరారయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని షెల్టర్ హోంకు తరలించారు. ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విమర్శలను తిప్పికొట్టారు. బీజేపీ హయాంలో ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరగలేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనపై ఉక్కుపాదం మోపుతామని, మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.