ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం.. భారీ డిస్కౌంట్ ఆఫర్లు
- ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ మెంబర్స్‌కు మొదలైన సేల్
- రేపటి నుంచి సాధారణ కస్టమర్లకు అందుబాటులోకి రాానున్న విక్రయాలు
- స్మార్ట్‌ఫోన్ల నుంచి ఫ్యాషన్ ఉత్పత్తుల వరకు అందుబాటులో భారీ డిస్కౌంట్లు
స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్
స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు ‘ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్-2025’లో భాగంగా భారీ తగ్గింపు ఆఫర్లపై ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. పలు రకాల స్మార్ట్‌ఫోన్లపై 50 శాతం వరకు డిస్కౌంట్లు పొందవచ్చు. యాపిల్, సామ్‌సంగ్, మోటరోలా, నథింక్, విడో, రియల్‌మీ, ఒప్పో వంటి ప్రముఖ బ్రాండ్ల ఫోన్లపై కూడా డిస్కౌంట్ డీల్స్ దక్కించుకోవచ్చు. స్మార్ట్ టీవీలపై కూడా భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్, స్పోర్ట్స్, మేకప్ వస్తువులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయని పేర్కొంది.