'గేమ్ ఛేంజర్'కు స్పెషల్ షోలు ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి
- ఈరోజు విడుదలైన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'
- టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలపై హైకోర్టులో విచారణ
- బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వొద్దని సూచన
అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తెల్లవారుజాము షోలకు అనుమతిని ఇవ్వడంపై పునరాలోచించాలని చెప్పింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ షోలు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇవ్వొద్దని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.