బ్యాంకులో పని ఒత్తిడి తట్టుకోలేక.. బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళా ఉద్యోగి
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- హైదరాబాద్ లోని బాచుపల్లిలో విషాదం
- పని ఒత్తిడి ఎక్కువగా ఉందంటూ వాపోయిందంటున్న బంధువులు
బ్యాంకులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని సత్యలావణ్య కొంత కాలంగా వాపోతోందని వీరమోహన్ చెప్పారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగకు శుక్రవారం సొంతూరుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆయన వివరించారు. గురువారం మధ్యాహ్నం బ్యాంకులో పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్లిన సత్యలావణ్య.. నేరుగా ఎంఎన్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ కు చేరుకుని టెర్రస్ పైకి వెళ్లారు. అక్కడి నుంచి కిందకు దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న సత్యలావణ్యను స్థానికులు ఎస్ఎల్ జీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె పరిస్థితి విషమించిందని, చికిత్స అందించినా కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.