అడవి శేష్‌ సినిమాల్లో హీరోయిన్లు మారిపోతున్నారు?

Are the heroines changing in Adavi Sesh movies
  • డెకాయిట్ చిత్రం నుంచి తప్పుకున్న శృతిహాసన్‌ 
  • శృతి స్థానంలో మృణాల్‌ ఠాకూర్‌ 
  • 'గూఢచారి' చిత్రంలో హీరోయిన్‌గా వామికా గబ్బి
ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగిన కథానాయకుల్లో అడవి శేష్‌ ఒకరు. 'మేజర్‌'  చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకున్న శేష్‌ సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా సెలెక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుతం ఆయన 'డెకాయిట్‌' అనే చిత్రంతో పాటు 'గూఢచారి-2' చిత్రంలో కూడా నటిస్తున్నారు. 

అయితే తాజాగా అడవి శేష్‌ నటిస్తున్న సినిమాల్లో కొంత భాగం సినిమా చిత్రీకరణ తరువాత హీరోయిన్స్‌ మారిపోవడం తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. అడవి శేష్‌ సరసన 'డెకాయిట్‌' చిత్రంలో శృతిహాసన్‌ను మొదటగా హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఈ చిత్రం రెండు షెడ్యూల్స్‌ పూర్తయిన తరువాత శృతిహాసన్‌ స్థానంలో మృణాల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేశారు.

 ఇందుకు హీరో, హీరోయిన్‌ మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్థలే కారణమని తెలిసింది. దీంతో పాటు శృతిహాసన్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌ను అయిష్టంగానే ఒప్పుకున్నారని, అందుకే ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి వాకౌట్‌ చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రంలో శేష్‌ సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారు. దీంతో పాటు ఈ కథానాయకుడు నటిస్తున్న మరో చిత్రం 'గూఢచారి-2' చిత్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. 

ఈ చిత్రంలో మొదటగా బంటియా సంధూను హీరోయిన్‌గా తీసుకున్నారు.  కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. భుజ్‌ షెడ్యూల్‌లో కూడా చిత్రీకరణ పాల్గొన్న బంటియా స్థానంలో వామికా గబ్బిని సెలెక్ట్‌ చేశారు. ఇటీవల భుజ్‌లో జరిగిన షెడ్యూల్‌ తరువాత నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అంతేకాదు అడవి శేష్‌, వామికా గబ్బితో యూరప్‌ షెడ్యూల్‌ను కూడా పూర్తిచేశారు మేకర్స్‌. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ -ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై  టి జి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళం పాన్-ఇండియన్ చిత్రంగా ఇది విడుదల కానుంది.
Go Back to Shorts
Adavi Sesh
Goodachari
G2
Wamiqa Gabbi
shruti haasan

More Telugu News