నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
- విశ్వవేదికపై తెలంగాణ స్థానం... ప్రస్థానం ఉండాలని ఆకాంక్షించిన సీఎం
- కొత్త ఏడాది అందరి జీవితాల్లో శుభసంతోషాలు నింపాలని రాసుకొచ్చిన సీఎం
- నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఉపముఖ్యమంత్రి, మంత్రులు
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21 నుంచి దావోస్‌లో పర్యటించనున్నారు. అంతకంటే ముందు జనవరి 13 నుంచి 15 వరకు ఆస్ట్రేలియాలో, జనవరి 19 నుంచి 21 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు.