వితంతు మహిళపై అత్యాచారం.. మాజీ మంత్రి కాకాణి అనుచరుడి అరెస్ట్
- ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేసిన వెంకట శేషయ్య
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
- తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకుని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు
అనంతరం రోజూ ఫోన్ చేస్తూ తన కోరిక తీర్చాలని వేధించాడని బాధితురాలు తెలిపింది. తెల్లకాగితంపై సంతకం చేయించుకుని నిత్యం బెదిరించేవాడని ఆరోపించింది. వెంకట శేషయ్య వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఉద్యోగం ఇప్పిస్తానని వెంకట శేషయ్య తనను మోసం చేశాడని, పలుమార్లు తనపై లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో సోమవారం రాత్రి వెంకట శేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వెంకట శేషయ్యను అరెస్టు చేశారని తెలిసి మాజీ మంత్రి కాకాణి అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. దీంతో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు వివరాలను వివరించి అందరినీ అక్కడి నుంచి పంపించివేశారు. ఆపై వెంకట శేషయ్యను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు పూర్తయ్యాక కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.