అమరావతి నిర్మాణం... మరో రూ. 2,723 కోట్ల పనులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- అమరావతి పనులను పరుగులు పెట్టించే పనిలో చంద్రబాబు
- 1.18 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశం
- రాజధాని రింగ్ రోడ్డుపై అధికారులతో చర్చ
జూన్ 12 నాటికి 1.18 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు, ఇప్పటి వరకు రూ. 47,288 కోట్ల విలువైన పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది.