తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు ఆదేశిస్తున్నాం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీనివాస్ గౌడ్
- టీటీడీపై విమర్శలు గుప్పించిన వైనం
- తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించబోమన్న టీటీడీ ఛైర్మన్
నిన్న ఉదయం తిరుమల శ్రీవారిని శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీటీడీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. దేవుడు ముందు అందరూ సమానమేనని... వివక్ష చూపడం సరికాదని చెప్పారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యాపారాల్లో, పదవుల్లో ఎక్కువ లబ్ధి పొందుతున్నది ఆంధ్ర వాళ్లేనని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తెలంగాణపై వివక్ష చూపితే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్లకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఛైర్మన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు ఆదేశిస్తున్నట్టు చెప్పారు.