వాలంటీర్ వ్యవస్థ లేకుండా చేశారు: చంద్రబాబుపై మల్లాది విష్ణు ఫైర్
- వైసీపీ హయాంలో పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరిగిందన్న మల్లాది విష్ణు
- చంద్రబాబు 3 లక్షల మంది పెన్షన్లను తొలగించారని మండిపాటు
- పెన్షన్ల తొలగింపును వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్య
వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు మనుగడలో లేకుండా చేశారని... ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వాలంటీర్లను పక్కకు తప్పించారని మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు 3 లక్షల మంది పెన్షన్లను తొలగించారని మండిపడ్డారు. 2 లక్షల మంది కొత్తగా పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారని... వారికి ఇవ్వకపోగా 3 లక్షల మంది పెన్షన్లను తీసేశారని విమర్శించారు. పెన్షన్లను తొలగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. జగన్ హయాంలో 66 లక్షల మందికి పైగా పెన్షన్లను ఇచ్చారని చెప్పారు.