Congo: కాంగోలో అంతుచిక్కని వ్యాధితో 143 మంది మృతి

Mysterious Illness Spreads Across Congo As WHO Not Able to Find Origins
షార్ట్స్‌లో చూడండి
ఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి వణికిస్తోంది. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 143 మంది చనిపోయారని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్యే ఎక్కువని తెలిపారు. వ్యాధి ఎందుకు, ఎలా సోకుతోందనే వివరాలు డాక్టర్లకు కూడా తెలియడంలేదట. ఈ మిస్టరీ వ్యాధిని వారు ‘డిసీజ్ ఎక్స్’ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కాంగోలోని క్వాంగో ప్రావిన్స్ లో డిసీజ్ ఎక్స్ కేసులు 406 నమోదయ్యాయని అధికారులు తెలిపారు.

ఈ అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రిలో చేరకుండానే మరికొందరు చనిపోయి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాంగోలో పేదరికం కారణంగా పిల్లల్లో పౌష్టికాహార లోపం సర్వసాధారణమని గుర్తుచేశారు. ఈ కారణంగానే డిసీజ్ ఎక్స్ ఎక్కడ మొదలైంది, ఎలా వ్యాపిస్తోందనే వివరాలు గుర్తించడం సమస్యగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) నిపుణులు వివరించారు. ఈ వ్యాధిపై పరిశోధన కోసం నిపుణుల బృందాలను కాంగోకు పంపించామని, వ్యాధి ప్రబలుతున్న ప్రాంతాల్లో రోగుల నుంచి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నామని డబ్ల్యూహెచ్ వో ఓ ప్రకటనలో తెలిపింది. వ్యాధి మూలాలను, కారకాలను గుర్తించి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.

వ్యాధి లక్షణాలు ఇవే..
  • జ్వరం, ఒళ్లు నొప్పులు
  • తలనొప్పి
  • దగ్గు
  • జలుబుతో ముక్కు కారడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • రక్తహీనత
Go Back to Shorts
Congo
Mysterious Illness
Disease X
WHO

More Telugu News