హైదరాబాద్-విజయవాడ హైవేపై లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... డ్రైవర్ దుర్మరణం
- చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో ప్రమాదం
- ముందు వెళుతున్న లారీని ఢీకొట్టిన లగ్జరీ బస్సు
- ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి
బస్సు డ్రైవర్ మృతదేహం క్యాబిన్లో ఇరుక్కుపోయింది. దీంతో క్రేన్ సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిచింది.