'పుష్ప‌-2' క‌లెక్ష‌న్ల సునామీ.. నాలుగో రోజే రూ. 800కోట్ల క్ల‌బ్‌లోకి!

Pushpa 2 Box Office Collection Day 4 Enters Rs 800 Crore Club
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వ‌చ్చిన 'పుష్ప‌2: ది రూల్' బాక్సాఫీస్ వ‌ద్ద‌ క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీ నాలుగో రోజే రూ. 800 కోట్ల క్ల‌బ్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కుడు ర‌మేశ్ బాల వెల్ల‌డించారు. ఓపెనింగ్‌ వీకెండ్‌లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ మూవీ క‌లెక్ష‌న్లు రూ. 800కోట్లు (గ్రాస్‌) దాటిన‌ట్లు ఆయ‌న ట్వీట్ చేశారు. 

ఇక హిందీ వెర్ష‌న్‌లో ఈ సినిమా వసూళ్ల ప‌రంగా కుమ్మేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో మొద‌టి వారాంతంలోనే పుష్ప‌-2 క‌లెక్ష‌న్లు రూ. 1000 కోట్లు దాట‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. కాగా, శాక్‌నిల్క్ ప్ర‌కారం ఆదివారం ఈ మూవీ మొత్తంగా రూ. 141.5 కోట్లు రాబట్టింది. ఇందులో హిందీ నుంచే ఏకంగా రూ. 85కోట్లు రావ‌డం విశేషం. 

అలాగే తెలుగు నుంచి రూ. 44 కోట్లు, త‌మిళం రూ. 9.5కోట్లు, మ‌ల‌యాళం రూ. 1.9కోట్లు, క‌న్న‌డ నుంచి రూ. 1.1 కోట్లు వ‌చ్చాయి. మొత్తంగా నాలుగు రోజులు పూర్త‌య్యేస‌రికి ఈ సినిమా నెట్ క‌లెక్ష‌న్లు రూ. 529.45కోట్ల‌కు చేరాయి. ఇందులో హిందీ వెర్ష‌న్ నుంచి రూ. 285.7కోట్లు రావ‌డం గ‌మ‌నార్హం. సో.. పూర్తి ర‌న్‌టైంలో ఈ సూప‌ర్ సీక్వెల్ వ‌సూళ్ల ప‌రంగా మ‌రిన్ని రికార్డులు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.     
Go Back to Shorts
Pushpa 2
Office Collection
Allu Arjun
Tollywood
Bollywood

More Telugu News