Stock Market: స్టాక్ మార్కెట్లలో ఐదు రోజుల లాభాలకు బ్రేక్

markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఐదు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. ఈ క్రమంలో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 56 పాయింట్ల నష్టంతో 81,709 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 24,677 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (3.05%), యాక్సిస్ బ్యాంక్ (1.61%), మారుతి (1.23%), ఎల్ అండ్ టీ (0.93%), ఐటీసీ (0.79%).

టాప్ లూజర్స్:
అదానీ పోర్ట్స్ (-1.20%), భారతి ఎయిర్ టెల్ (-1.01%), ఏషియన్ పెయింట్స్ (-0.93%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.73%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.71%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News