హైదరాబాద్‌ను కాపాడాలనే హైడ్రాను తీసుకువచ్చాం: కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్
- హైడ్రాకు తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శ
- బీసీలకు బీఆర్ఎస్ అనుకూలమా? కాదా? చెప్పాలని నిలదీత
- బీఆర్ఎస్ సినిమాకు శుభం కార్డు పడిందన్న ఆది శ్రీనివాస్
బీఆర్ఎస్ హయాంలో సమగ్ర సర్వే చేయించి ఆ తర్వాత దానిని అటకెక్కించారని విమర్శించారు. బీసీలకు బీఆర్ఎస్ అనుకూలమా? కాదా? చెప్పాలని నిలదీశారు. దామాషా పద్ధతిలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఫలాలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తాము బీసీ గణన చేపడుతున్నట్లు చెప్పారు.
బతుకమ్మ చీరల పేరిట గత ప్రభుత్వం నేతన్నల జీవితాలను ఆగం చేసిందన్నారు. సూరత్ నుంచి చీరలను తెచ్చి ఇచ్చారని మండిపడ్డారు. ఆ చీరలు కూడా మహిళలు కట్టుకోవడానికి ఉపయోగపడలేదని... పంటచేలలో బెదురు పెట్టేందుకు ఉపయోగపడ్డాయని విమర్శించారు. ఒక్క డీఎస్సీ ఇవ్వని ప్రభుత్వం కేసీఆర్‌దే అన్నారు. గ్రూప్-1 పేపర్లు లీక్ చేసిన చరిత్ర ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సినిమాకు శుభం కార్డు పడిందని చురక అంటించారు.