Kissik Song: పుష్ప‌-2లోని 'కిస్సిక్' సాంగ్.. ఆల్‌టైమ్ రికార్డు!

Kissik Song Sets an All Time Record
షార్ట్స్‌లో చూడండి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న భారీ చిత్రం పుష్ప‌-2. ఈ సినిమా డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాట‌ల‌తో పుష్ప‌-2పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఐట‌మ్ సాంగ్ కిస్సిక్ భారీ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. 

ఈ పాట ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. 24 గంట‌ల్లో ఇండియాలోనే అత్య‌ధిక వ్యూస్ సాధించిన లిరిక‌ల్ వీడియోగా నిలిచిన‌ట్లు తెలిపారు. మొత్తంగా 42 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ న‌మోదైన‌ట్లు చెప్పారు. 

ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో నెం.01గా ట్రెండింగ్‌లో ఉంద‌ని పేర్కొంటూ ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఐట‌మ్ సాంగ్‌లో అల్లు అర్జున్‌, యంగ్ బ్యూటీ శ్రీలీల స్టెప్పులేసిన విష‌యం తెలిసిందే.
Go Back to Shorts
Kissik Song
Pushpa2
Allu Arjun
Sukumar
Tollywood
YouTube

More Telugu News