Stock Market: మార్కెట్లపై మహారాష్ట్ర ఎఫెక్స్.. 80 వేలు దాటిన సెన్సెక్స్

Sensex crosses 80K mark
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయం సాధించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 992 పాయింట్లు లాభపడి 80,109కి ఎగబాకింది. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 1,300 పాయింట్లకు పైగా లాభపడటం గమనార్హం. నిఫ్టీ 314 పాయింట్లు పెరిగి 24,221కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (4.13%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.52%), అదానీ పోర్ట్స్ (2.55%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.21%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.82%).

టాప్ లూజర్స్:
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.40%), టెక్ మహీంద్రా (-0.79%), ఏసియన్ పెయింట్స్ (-0.74%), ఇన్ఫోసిస్ (-0.73%), మారుతి (-0.49%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News