సానియా మీర్జా రెండో పెళ్లిపై వార్తలు.. ముస్లింను మాత్రం పెళ్లాడవద్దంటూ నెటిజన్ సలహా
- షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్న సానియా
- కొత్త జీవితంపై సానియా పోస్ట్
- ఆమె కొత్త జీవితం ప్రారంభించాలంటూనే ఆశ్చర్యకరమైన సలహా ఇచ్చిన అభిమాని
- షమీతో పెళ్లి వార్తలను ఊహాగానాలుగా కొట్టేసిన సానియా తండ్రి
ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి అనూహ్యమైన సలహా వచ్చింది. ‘కొత్త జీవితం ప్రారంభించాలి’ అన్న సానియా పోస్టుకు ఓ అభిమాని స్పందిస్తూ.. ‘సానియా కొత్త జీవితం ప్రారంభించాలి, కానీ ముస్లిం అబ్బాయిని మాత్రం పెళ్లాడొద్దు’ అని సలహా ఇచ్చాడు. అతడి సలహాకు మిశ్రమ స్పందన లభించింది.
షమీతో రెండో పెళ్లిపై రూమర్లు
సానియా మీర్జా, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవల వార్తలు హల్చల్ చేశాయి. వీటిని సానియా తండ్రి ఖండించారు. వాటిని నిరాధార వార్తలుగా కొట్టిపడేశారు. కాగా, షమీ కూడా భార్య హసీన్ జహాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు.