కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో మాత్రం కాదు!
- ఆస్ట్రేలియా పర్యటనలోనూ కొనసాగుతున్న కోహ్లీ పేలవ ఫామ్
- లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను విడిచిపెట్టిన కోహ్లీ
- గత ఐదేళ్లలో అత్యధిక క్యాచ్‌లు విడిచిపెట్టిన ఆటగాడిగా కోహ్లీ పేరున చెత్త రికార్డు
- ఆ తర్వాతి స్థానంలో రోహిత్, కేఎల్ రాహుల్
ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో ఓ సింపుల్ క్యాచ్‌ను వదిలిపెట్టేసిన కోహ్లీ చెత్త రికార్డును తన పేరున రాసుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను విరాట్ జారవిడిచాడు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో అత్యధిక క్యాచ్‌లు విడిచిపెట్టిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. 2019 నుంచి ఇప్పటి వరకు కోహ్లీ ఏకంగా 47 క్యాచ్‌లు విడిచిపెట్టాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్ ఉన్నారు. వీరిద్దరూ చెరో 21 క్యాచ్‌లు విడిచిపెట్టారు. 20 క్యాచ్‌లు విడిచిపెట్టిన సిరాజ్ వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు.