కన్నతల్లికి తిండి పెట్టని కొడుకు.. అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్
--
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో సరైన వసతులు కల్పించలేదని కేటీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆహారం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని, రోజుకో పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు మరణిస్తున్నా సరైన చర్యలు తీసుకోకుండా పిట్టలదొర మాటలు చెబుతున్నాడంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆసుపత్రులలో, రైతులు జైళ్లలో, నిరుద్యోగులు రోడ్లపై ఆందోళనలలో ఉన్నారని చెబుతూ ‘జాగో తెలంగాణ’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.