'మన్ కీ బాత్' తరహాలో ఏపీ ప్రజల ముందుకు సీఎం చంద్రబాబు!
- ‘డయల్ యువర్ సీఎం’, ‘మన్ కీ బాత్’ కలయికలో కొత్త కార్యక్రమంతో ప్రజలతో ముఖాముఖీ
- ఆడియో, వీడియో రూపంలో కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు
- సంక్రాంతికి కార్యక్రమం ప్రారంభించే అవకాశాలు
ఈ మేరకు అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు బుధవారం కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ‘డయల్ యువర్ సీఎం’ ప్రత్యేక కార్యక్రమాన్ని చంద్రబాబు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం, మన్ కీ బాత్ కలయికలో ఒక నూతన కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన సిద్ధమవుతున్నారని తెలిసింది.