ఈ మధ్యాహ్నం రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు.. ప్రత్యేక విమానంలో బయల్దేరుతున్న చంద్రబాబు
- నిన్న మధ్యాహ్నం కన్నుమూసిన రామ్మూర్తినాయుడు
- ఈ మధ్యాహ్నం 3 గంటలకు నారావారిపల్లెలో అంత్యక్రియలు
- అంత్యక్రియలకు హాజరుకానున్న నారా, నందమూరి కుటుంబసభ్యులు
రామ్మూర్తినాయుడు అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఆయన మరో ప్రత్యేక విమానంలో తిరుపతికి బయల్దేరుతారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు నారా, నందమూరి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు... తెలంగాణ నుంచి కూడా పలువురు నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.