'జీ 5' సెంటర్లోకి అడుగుపెడుతున్న కొత్త సినిమా!
- ఫ్యామిలీ ఎమోషన్స్ తో 'మా నాన్న సూపర్ హీరో'
- సుధీర్ బాబు జోడిగా కనిపించనున్న ఆర్ణ
- అక్టోబర్ 11న విడుదలైన సినిమా
- ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఈ సినిమా త్వరలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'జీ 5' వారు దక్కించుకున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ, ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. జై క్రిష్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, సాయిచంద్ .. సాయాజీ షిండే ముఖ్యమైన పాత్రలను పోషించారు.
కథ విషయానికి వస్తే .. చిన్నతనంలోనే తండ్రికి దూరమైన హీరో, మరొకరి దగ్గర పెరుగుతాడు. తనని దత్తత చేసుకున్న వ్యక్తిని తండ్రిగా ప్రేమిస్తాడు. అయితే అనూహ్యమైన కొన్ని పరిణామాల వలన, అతనిని పెంచిన తండ్రి జైల్లో పడతాడు. అతనిని బయటికి తీసుకు రావాలంటే హీరోకి కోటి రూపాయలు అవసరమవుతాయి. ఆ డబ్బు కోసం హీరో ఏం చేస్తాడు? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.