సాకర్ మైదానంలో ఆటగాడిపై పిడుగు... వీడియో ఇదిగో!
- పెరూలో విషాద ఘటన
- వర్షంతో నిలిచిన ఫుట్ బాల్ మ్యాచ్
- ఆటగాళ్లు డగౌట్ కు వెళుతుండగా పిడుగుపాటు
- ఒకరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
అయితే, మ్యాచ్ మధ్యలో వర్షం పడడంతో రిఫరీ మ్యాచ్ నిలిపివేశారు. ఆటగాళ్లు తమ డగౌట్ కు వెళుతుండగా, పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దాంతో ఓ ఆటగాడు, రిఫరీ కుప్పకూలిపోయారు. రిఫరీకి తీవ్రగాయాలు కాగా, ఆటగాడు నేరుగా పిడుగుపాటుకు గురికావడంతో అక్కడిక్కడే మరణించాడు. మరో నలుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన తాలూకు వీడియోను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఏంఏ) తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది.