ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వైఎస్ జగన్ బెంగళూరుకు .. ఆలస్యంగా టేకాఫ్ .. ఎందుకంటే..?
- మూడు రోజుల కడప జిల్లా పర్యటన ముగించుకొని బెంగళూరుకు వెళ్లిన వైఎస్ జగన్
- వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రత్యేక హెలికాఫ్టర్ కు ఆలస్యంగా ఏటీసీ నుండి అనుమతి
- పొగమంచు తగ్గిన తర్వాత ప్రత్యేక హెలికాఫ్టర్ లో బెంగళూరు బయలుదేరిన వైఎస్ జగన్
కాగా కడప జిల్లా పర్యటనలో మూడు రోజుల పాటు బిజీబిజీగా గడిపిన వైఎస్ జగన్ .. నాయకుల మధ్య ఉన్న విభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టారు. జమ్మలమడుగు ఇన్ చార్జి వ్యవహారంపై నెలకొన్న సమస్య పరిష్కారానికి స్థానిక నేతలతో పాటు జిల్లా నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదర్ఛడానికి జగన్ కృషి చేశారు. ఈ క్రమంలో మూడు మండలాలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మరో మూడు మండలాలకు రామసుబ్బారెడ్డి ఇన్‌చార్జ్ లు గా వ్యవహరించాలని సూచించారు. అలానే కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పని చేయాలని ఆదేశించారు. బుధవారం పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలు విన్న జగన్.. పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.