జగన్ తన పదవీకాలమంతా వసూళ్లతోనే గడిపారు: మాణికం ఠాగూర్
- వైఎస్ఆర్‌పై ఎక్స్ వేదికగా వైసీపీ పోస్ట్
- దానిపై ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ ఘాటు స్పందన
- జగన్ సీఎంగా ఉన్నప్పుడు ధనవంతుల్నే కలిసేవారని వ్యాఖ్య
- నిజానికి జగన్ ఎప్పుడూ వైఎస్‌ను అనుసరించలేదని విమర్శ
"జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం ధనవంతుల్నే కలిసేవారు. ప్రజా దర్బార్ పేరిట ప్రజల సమస్యలు తెలుసుకునే ఆలోచన చేయలేదు. నిజానికి జగన్ ఎప్పుడూ వైఎస్‌ను అనుసరించలేదు. తన పదవీకాలమంతా జగన్ వసూళ్లతోనే గడిపారు" అని మాణికం ఠాగూర్ పేర్కొన్నారు.