రూ.10 నాణెం చలామణిపై సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ కీలక ప్రకటన
- రూ.10 నాణెం రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చునని వెల్లడి
- నిరభ్యంతరంగా రూ.10 నాణేన్ని ఉపయోగించవచ్చునన్న జనరల్ మేనేజర్
- ఆర్టీసీ బస్సుల్లో చలామణి అవుతున్నాయన్న జనరల్ మేనేజర్
హైదరాబాద్‌లోని కోఠి బ్యాంకు వద్ద రూ.10 నాణేల చలామణిపై ఆవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నాణేల చలామణిని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలనే ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
తమ బ్యాంకు ఖాతాదారులు ఎవరైనా ఈ నాణేలను నిరభ్యంతరంగా వినియోగించవచ్చని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఇవి చెల్లుబాటు అవుతున్నాయన్నారు. రూ.10 నాణేలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. రూ.10 నోటు కంటే నాణెం ఎక్కువ కాలం మన్నికతో ఉంటుందన్నారు.