అశ్లీల నృత్యాలతో యువకులకు వల.. బంజారాహిల్స్‌లో పబ్‌పై పోలీసుల దాడి

police raids on pub in banjara hills
  • పబ్ ముసుగులో చట్టవ్యతిరేక కార్యకలాపాలు 
  • యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ యువకులకు వల
  • 42 మంది మహిళలు సహా 140 మంది అరెస్ట్
అశ్లీల నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఓ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి 42 మంది మహిళలు సహా 140 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగింది. అశ్లీల నృత్య ప్రదర్శనలతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై ఆకస్మికంగా దాడులు చేశారు. 

నిబంధనలకు విరుద్ధంగా యువతులతో నిర్వాహకులు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.  42 మంది మహిళలు సహా 140 మందిని అరెస్టు చేశారు. పబ్ నిర్వాహకులు, క్యాషియర్, డీజే ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యువకులను ఆకర్షించి సొమ్ము చేసుకునేందుకకు వివిధ రాష్ట్రాల నుంచి మహిళలను పబ్‌కు రప్పించినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Go Back to Shorts
Banjara Hills
pub
police raids
Hyderabad

More Telugu News