Priyanka Gandhi: వయనాడ్ లోక్ సభ స్థానం అభ్యర్థిగా ప్రియాంకగాంధీ... కాంగ్రెస్ అధికారిక ప్రకటన

Priyanka Gandhi name announced from Wayanad
షార్ట్స్‌లో చూడండి
కేరళలో లోక్ సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉపఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంకగాంధీ వాద్రా పేరును ప్రకటించింది. వయనాడ్‌తో పాటు పాలక్కడ్, చెళక్కర (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ, పాలక్కడ్ నుంచి రాహుల్ మామ్‌కుటథిల్, చెళక్కర (ఎస్సీ) నుంచి రమ్య హరిదాస్ పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. గత లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలి నుంచి పోటీ చేసి... రెండుచోట్లా గెలిచారు. వయనాడ్ స్థానాన్ని వదులుకోవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
Go Back to Shorts
Priyanka Gandhi
Wayanad
Lok Sabha Polls

More Telugu News