విజయవాడ ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భవానీలు
- కనకదుర్గమ్మ ఆలయం వద్ద విపరీతమైన రద్దీ
- భవానీ స్వాముల రద్దీకి తగినట్టుగా ఏర్పాట్లు
- స్వయంగా పర్యవేక్షిస్తున్న దేవాదాయ శాఖ కమిషనర్, దుర్గ గుడి ఈవో
క్యూలైన్లలో మహిళలు, పిల్లలు, వృద్ధ స్వాములు కూడా ఉండడంతో వారికోసం పాలు, బిస్కెట్లు, మజ్జిగ అందిస్తున్నారు. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడిక్కడ తాగునీరు అందుబాటులో ఉంచారు. క్యూలైన్లకు దగ్గరగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.