తిరుమలలో కన్నుల పండుగగా సింహ వాహన సేవ
- వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- ఉదయం సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు
- రాత్రి సర్వ భూపాల వాహనంపై మలయప్ప స్వామి అభయం
ఉత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై మలయప్ప స్వామి వీణ ధరించి సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధాత్మికానందాన్ని కలిగించాయి. అయిదు రాష్ట్రాలకు చెందిన కళాకారులు 18 కళాబృందాలు 511 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు.