రేపు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు

CM Chandrababu and Bhuvaneswari will attend Tirumala Brahmotsavams
  • అక్టోబరు 4న తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • తిరుమలలో సీఎం చంద్రబాబు రెండ్రోజుల పర్యటన
  • పెద శేష వాహనం సేవలో పాల్గొననున్న చంద్రబాబు, భువనేశ్వరి 
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ముస్తాబైంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి  12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 

ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు రేపు (అక్టోబరు 4) లాంఛనంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఎల్లుండి (అక్టోబరు 5)న కూడా చంద్రబాబు దంపతులు బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. వారు పెద శేష వాహన సేవలో పాల్గొంటారు.
Go Back to Shorts
Chandrababu
Nara Bhuvaneswari
Tirumala
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News