ఏపీలో మద్యం షాపులు బంద్.. మందుబాబులకు తీవ్ర ఇబ్బందులు!
- నిన్నటితో ముగిసిన వైన్ షాప్స్ కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి
- విధులకు హాజరు కాలేమన్న కాంట్రాక్టు ఉద్యోగులు
- ఈ నెల 12 నుంచి కొత్త మద్యం పాలసీ
ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా 3,240 వైన్ షాపులు మూతపడ్డాయి. వైన్ షాపులు బంద్ కావడంతో మందుబాబులకు బార్లకు వెళ్లడం మినహా మరో దారిలేకుండా పోయింది. బార్లలో ధరలను భరించలేని వారు... మందు లేక పస్తులు ఉండే పరిస్థితి నెలకొంది!
మరోవైపు, ఈ నెల 12 నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వైన్ షాపులు ఏర్పాటు కానున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి వైన్ షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయింది. దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు విధానాల్లో స్వీకరిస్తున్నారు. ఈ నెల 11న మొత్తం 3,396 వైన్ షాపులకు లాటరీ తీస్తారు.
టెండర్ దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలు కాగా... వైన్ షాపులు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజుల కింద రూ. 50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల కాలపరిమితితో వైన్ షాపులను ప్రభుత్వం మంజూరు చేస్తోంది.