Advertisement

వైసీపీ నేత శిల్పా మోహ‌న్ రెడ్డికి 'హైడ్రా' నోటీసులు

HYDRA Notices to Shilpa Mohan Reddy
  • సంగారెడ్డి జిల్లాలోని న‌ల్ల‌వాగును క‌బ్జా చేసి వెంచ‌ర్ వేసిన‌ట్లు గుర్తింపు
  • వెంచ‌ర్‌లోని అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిలో అధికారులు
  • వైఎస్ఆర్ మంత్రివ‌ర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న శిల్పా మోహ‌న్ రెడ్డి
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహ‌న్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఆయ‌న సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌పేట మండ‌లం నాగ్స‌న్‌ప‌ల్లిలోని న‌ల్ల‌వాగును ఆక్ర‌మించి వెంచ‌ర్ వేసిన‌ట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఇటీవ‌ల స‌ర్వే చేప‌ట్టిన అధికారులు వెంచ‌ర్‌లోని అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన‌ శిల్పా మోహ‌న్ రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాజీ సీఎం వైఎస్ఆర్ మంత్రివ‌ర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న ఫ్యామిలీ వ్యాపారంతో పాటు వెంచ‌ర్లు వేసి నిర్మాణాలు చేప‌ట్టేది. శిల్పా మోహ‌న్ రెడ్డి మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే న‌ల్ల‌వాగును క‌బ్జా చేసి వెంచ‌ర్‌లో నిర్మాణాలు చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం.
Advertisement
HYDRA
Shilpa Mohan Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News