ఇలాంటి ద్రోహులను క్షమించకూడదు: నాగబాబు
Add ap7am to your home Screen

ఇలాంటి ద్రోహులను క్షమించకూడదు: నాగబాబు

Nagababu response on Tirumala laddu controversy
  • తిరుమల లడ్డూను జంతు కొవ్వుతో కల్తీ చేశారన్న నాగబాబు
  • హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరమని వ్యాఖ్య
  • హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానన్న నాగబాబు
పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే అంశం కలకలం రేపింది. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు స్పందిస్తూ... ద్రోహులను క్షమించకూడదని పేర్కొన్నారు.  

ఎక్స్ వేదికగా నాగబాబు స్పందిస్తూ.. "ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'తిరుమల తిరుపతి దేవస్థానం' ప్రసాదాన్ని జంతు కొవ్వుతో, చేప నూనెతో కల్తీ చేసి కోట్లమంది హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకున్నారు కానీ... కోట్ల మంది హిందువుల గోడు కూడగట్టుకున్నారు అని గుర్తించలేకపోయారు. 

ఒక వ్యక్తి ఒక మతాన్ని స్వీకరించి ఆ దేవున్ని నిష్టతో పూజించి ఆ దేవుడికి ప్రసాదం అర్పించడం జరుగుతుంది. తదుపరి ఆ ప్రసాదాన్ని భుజిస్తే ఆ దేవుడే వారితో మమేకమైనట్టు నమ్ముతారు. అంతటి విశిష్టమైన ప్రసాదాన్ని అందులోను తిరుమల వంటి ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలోని లడ్డూ ప్రసాదాన్ని నాలుగు రాళ్లు మిగుల్చుకోవాలనే దురుద్దేశంతో... జంతు కొవ్వు సైతం వెయ్యడానికి వెనకాడని ఇలాంటి ద్రోహుల్ని క్షమించకూడదు. అందుకే తితిదేలాంటి శాఖలలో హిందుత్వాన్ని ఆచరించే వారుంటేనే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు పునరావృతం అవ్వవని నమ్ముతూ ఈ హేయమైన చర్యని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
Advertisement
Nagababu
Janasena
Tirumala
Laddu

More Telugu News