తిరుమల లడ్డు వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
- ఎన్‌డీడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్‌లో ఇటీవల లడ్డు శాంపిల్స్ పరీక్ష
- అదే సంస్థతో నాణ్యతను పరిశీలించే మిషన్ల కోసం ఒప్పందం
- డిసెంబర్ నాటికి తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు
ఈ సందర్భంగా వారితో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. నెయ్యిలో నాణ్యతను పరీక్షించే రూ. 75 లక్షల విలువైన పరికరాలు ఇచ్చేందుకు ఎన్‌డీడీబీ సిద్ధమైంది. వీటిని దిగుమతి చేసుకున్న అనంతరం టీటీడీ ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. 2015-16లో తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ దానిని పట్టించుకునేవారు లేకపోవడంతో అది కాస్తా మరుగున పడింది. రిటైర్డ్ ఉద్యోగి ఒకరు నాణ్యత పరీక్షలు చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.